- కేంద్ర ఓబీసీ జాబితాలో అవి లేవు
- పేర్లలో మార్పులు కోరుతూ వినతులు
- ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్
- సమీక్షలో బీసీ కమిషన్ తీర్మానం
హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ వెనుకబడిన తరగ తుల జాబితాలో ఉండి కేంద్ర ఓబీసీ జాబితాలో లేని 40 కులాలను వెంటనే చేర్చాలని బీసీ కమిషన్ కోరింది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కోరాలని కమిషన్ తీర్మానించింది. ఉమ్మడి జిల్లాల వారీగా జరిపిన బహిరంగ విచారణలో వచ్చిన వినతులను శుక్రవారం కమిషన్ కార్యాలయంలో సమీక్షించింది.
రాష్ట్ర బీసీ జాబితాలో 130 కులాలు ఉండగా, కేంద్ర ఓబీసీ జాబితాలో 90 కులాలే ఉన్నాయని స్ప ష్టం చేసింది. మిగిలిన 40 కులాలను కేంద్ర జాబితాలో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్ర తిపాదనలు పంపినా కేంద్రం ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కొంది. దొమ్మర, పిచ్చకుంట్ల, బుడబుక్కల, తమ్మలి తదితర కులాల పేర్లలో మార్పు కోరుతూ వచ్చిన వినతులపై కమిష న్ సానుకూలంగా స్పందించింది.
ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ప్ర భుత్వానికి తమ సిఫారసులు అందించాలని నిర్ణయించింది. ఈ అంశంపై ప్రజాభిప్రాయా లు కోరుతూ కమిషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసి నెలరోజుల పాటు అభిప్రాయాలను స్వీకరించనున్నది. అంతకు ముందు బీసీ వెల్ఫేర్ శాఖ సెక్రటరీ శ్రీధర్ కమిషన్ కార్యాలయం లో చైర్మన్, సభ్యులతో భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించారు.
అనంతరం అక్బరుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం ప్రజాప్రతినిధు లు కమిషన్‌తో భేటీ అయ్యి ముస్లింలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపు, తదితర అంశాలపై వినతిపత్రం అందజేశారు.