పెద్దపల్లి, డిసెంబర్ 31: పూర్వీకుల నుంచి వస్తున్న మా కులవృత్తిని ఎన్టిపిసి బూడిద కనుమరుగు చేస్తున్నదని, న్యాయం కొరకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూ మెంట్ రాష్ర్ట జాయింట్ సెక్రెటరీకి మంగళ వారం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ మహేందర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్క లపల్లి గ్రామ సమీపము గల ఎన్టిపిసి డ్యామ్ లో ఈతవనాన్ని నమ్ముకుని మా తాతలు తండ్రులు ఇప్పుడు మేము వీటిపై ఆధార పడి బతుకుతున్నామని, ఎన్టిపిసి బూడిద మా జీవనాధారం గల ఈతవనాన్ని నిర్దిక్ష ణంగా నేలమట్టం చేసి బూడిద చెరువుగా మార్చి మా జీవితాలను బుగ్గిపాలు చేస్తుంద ని,
ఉపాధి లేక కులవృత్తిపై ఆధారపడి బతు కుతున్న మేము విదిన పడ్డామని, ఆబ్కారి శాఖ వారు కొద్దిరోజుల క్రితం మీకు నష్ట పరిహారం ఇస్తామని, మా పెద్దమనుషులకు చెప్పి కొంతమంది గీత కార్మికుల అభిప్రా య సేకరణ చేయకుండా అరాకోర నష్టపరి హారం ఇచ్చి చేతులు దులుపుకునేలా ప్రవర్తి స్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ సోలార్ ప్లాంట్ ద్వారా కాలుష్యం.
మరో వైపు బూడిద ద్వారా వాయు కాలుష్యం వల్ల మా గ్రామంలో ప్రజలకు శ్వాస కోస వ్యాధు లతో అనారోగ్యాలకు గురవుతున్నామని, మీ ద్వారా మా ప్రభావిత గ్రామంలో నిరుద్యో గులు చాలామంది తయ్యారు అయ్యారని, ఎన్టిపిసి యజమాన్యంతో మాట్లాడి మాకు ఉపాధి కల్పించాలని కోరారు.
దీనిపై ఎవరు మాకు ఏ రాజకీయ నాయకులు సంఘాల నాయకులు మాకు న్యాయం చేయడం లేదని, కావున మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని, వచ్చామన్నారు, ఆప్కారి వారితో మాట్లాడి, ఎన్టిపిసి యజమాన్యంతో మాట్లాడి మాకు న్యాయం చేయాలి అని వినతి పత్రం అందజేశారు.
దీనికి నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్”” రాష్ర్ట జాయింట్ సెక్రెటరీ జిల్లా అధ్యక్షులు మహేందర్”” స్పందించి మీ సమస్యలను త్వరలోనే పరిష్కరించే విధంగా ఎన్టిపిసి యజమాన్యంతో మరియు ఆప్కారి శాఖతో మాట్లాడి పరిష్కారమయ్యే దిశగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మ మహేష్ గౌడ్, సాయి గౌడ్ పాల్గొన్నారు.