ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): బీసీల్లోని ఉపకులాలవారీగా లెక్క లు బయటపెట్టాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య నివేదిక, సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే గణాంకాల్లో వ్యత్యాసముందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన కేసీఆర్ బీసీల లెక్కలను ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని డిమాండ్‌చేశారు. బీసీలంటే బిగ్ క్లాస్ అని పేర్కొన్నారు. కేసీఆర్ సభకు రాకపోయినా.. కనీసం సర్వేలో పాల్గొనాలన్నారు.
మీతో కలిసి రావడానికి సిద్ధం: బండ ప్రకాశ్
రాష్ట్రంలో బీసీలంతా ఆందోళనలో ఉన్నారని, కులగణన సర్వే ద్వారా ఏం చేయబోతున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పెడుతున్నారేమోనని భావించామని, కానీ నివేదికను ముందుపెట్టారని విమర్శించారు. బీసీల రిజర్వేషన్ల పెంపు విషయంలో సమాజమంతా కలిసి నడవడానికి సిద్ధంగా ఉందని, ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.
చరిత్రలో గొప్ప రోజు: మహేశ్‌కుమార్‌గౌడ్
దేశ చరిత్రలోనే ఈ రోజు గొప్ప రోజని, కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూసిన వారికి ప్రగతి ఫలాలు కులగణన సర్వేతో అందబోతున్నాయని ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు అమలులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేను గొప్పగా చేపట్టిందన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించి బీఆర్‌ఎస్ ఆ వర్గాలను మోసం చేసిందని విమర్శించారు.