12-04-2025 12:00:00 AM
తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ
ముషీరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి) : దేశ వ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో కులగణన చేయాలని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని, బాల రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ ఆయిలీ వెంకన్న గౌడ్లు డిమాండ్ చేశారు. బీసీల ఆరాద్యుడు, గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జోతిబాపూలే అని ఆయన ఆశయ సాధన కోసం ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం చిక్కడపల్లిలోని సమన్వయ కమిటీ కార్యాలయంలో జోతిబాపూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన చిత్ర వటానికి పూల మాలాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో బీసీల మహా గర్జన చేసిన కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయం అన్నారు.
కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో స్వేచ్ఛగా అమలు చేసుకునేందుకు 9వ షెడ్యూల్లో చేర్చాలని వారు కోరారు. 10 సంవత్సరాల కాలంలో బీసీల ఉసు ఎత్తని బిఆర్‌ఎస్కు పూలే గురిం చి మాట్లాడే అర్హత లేదని కవిత ఏనాడు పూలే ప్రస్తావన చేయాలేదని లిక్కర్ కుంభకోణంలో కురుకుపోయి దాని నుంచి బయ టపడేందుకే పూలేను వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, వివిధ సంఘాల నాయకులు సూగూరి దుర్గయ్య గౌడ్, కోల శ్రీనివాస్, గడ్డమీది విజయకుమార్ గౌడ్, బైరి శేఖర్, బాలగొని వెంకటేష్ గౌడ్, సింగం నగేష్ గౌడ్, కోయడ హర్షవర్ధన్ గౌడ్ పాల్గొన్నారు.