calender_icon.png 20 April, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనగణనలో కులగణన చేయాలి

25-03-2025 12:00:00 AM

ప్రధానికి పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్ డిమాండ్ 

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం చేప ట్టబోయే జనగణనలో కులగణన చేసి బీసీ ప్రధాని అని చెప్పుకొనే మోదీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సోమవారం గాంధీభవన్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్‌తో కలిసి వీహెచ్ మీడియాతో మాట్లాడారు.

బీసీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడానికి ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే ధర్నాకు పార్టీలకు అతీతంగా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కులగణన చేశారని, స్థాని క సంస్థల ఎన్నిక లతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అసెంబ్లీలో తీర్మా నం చేశారని వీహెచ్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీల రిజర్వేషన్ల పెంపు బిల్లును పార్లమెంట్‌లోనూ ఆమోదించాలని ఆయన వీహెచ్ డిమాండ్ చేశారు.