04-03-2025 12:58:47 AM
ఆర్మూర్, మార్చి 3: (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని పచ్చల నడకుడ గ్రామంలో తండ్రి మృతదేహాన్ని ముట్టుకు న్నాడని కులపెద్దలు కొడుకును కులం నుంచి బహిష్కరణ చేశారు. నడకుడ గ్రామానికి చెందిన జెండాకారి లింగన్నకు ఇద్దరు కుమారులు కాగా ఇంటిని పంచే విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొన్నది.
ఇరువురి మధ్య సందీ కుదుర్చడానికి ఈ పంచాయితీ కుల సంఘం పెద్దల వద్దకు పోగా వారు చెప్పిన తీర్పుపై తండ్రి జెండాకారి లింగన్న సరియైన న్యాయం జరగలేదని అభ్యంత రం వ్యక్తం చేయడంతో. దీంతో కుల పెద్దలు ఆగ్రహించి అతడిని మూడేళ్లపాటు కులం బహిష్కరించారు.
అంతేకాదు తమ మాటను దాటి తండ్రితో మాట్లాడినం దుకు చిన్న కొడుకు లింగేశ్వర్కు నాలుగు దఫాలుగా సూమారు రూ.60 వేల వరకు జరిమానా విధించారు. దీంతోపాటు సంఘ సభ్యులు ఖర్చుల కింద రూ. లక్షన్నర నగదును తీసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం లింగన్న అనారోగ్యానికి గురికాగా ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గంమధ్యలోనే మరణము
పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
తండ్రి మాృతదేహాన్ని లింగేశ్వర్ తన ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోగా కులం నుంచి బహిష్కరించిన లింగన్న మృత దేహాన్ని ఇంటికి ఎలా తీసుకెళ్తారని కుల సంఘం ప్రతినిధులు నిలదీశారు.కులం కట్టు బాటును ఖాదర్ చేయలేదని కులం నుంచి బహి ష్కరిస్తూ అతనికి రూ.8 వేలు జరిమానా కష్టాలంటూ అతనిని ఆదేశించారు. లింగేశ్వర్ అన్నే సాయిలు కులం కట్టుబాట్లకి ఒప్పుకోవడంతో మృతదేహాన్ని పెద్ద కుమారుడు సాయిలు ఇంట్లోకి చేర్చారు.
దీంతో లింగేశ్వర్ గత్యంతరం లేని పరిస్థితిలో తన తల్లితో కలిసి వేల్పూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనకుండా చేసినవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరాడు. నిన్న సాయంత్రం గ్రామంలో ప్రారంభమైన వివాదం కొనసాగుతుండటంపై స్థానికంగా ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇలాంటివి సంఘటనలు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు.