calender_icon.png 3 January, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల గణనకు కార్యాచరణ షురూ!

15-10-2024 01:19:57 AM

24 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ

సూత్రపాయంగా రాష్ట్ర బీసీ కమిషన్ నిర్ణయం

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం కుల గణనపై కసరత్తును వేగవంతం చేసింది. దీనిలో భాగంగా బీసీ కమిషన్‌తో సోమవారం ప్లానింగ్ కమిషన్ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయా సమావేశమయ్యారు. కుల గణనకు సర్కార్ చేస్తున్న సన్నాహాలను ఆయన కమిషన్‌కు వివరించారు.

బీసీ కమిషన్, ప్లానింగ్ కమిషన్ సమన్వయంతో కులగణన చేపట్టాల్సి ఉంటుందన్నారు. తర్వాత నిర్ణయించే రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఈ నెల 24 నుంచి కమిషన్ ఉమ్మడి జిల్లాల కేంద్రాలకు అభిప్రాయాను సేకరించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది.

అలాగే బీసీ వర్గాలకు చెందిన మేధావులతో త్వరలోనే మేధోమథనం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఎప్పుడెప్పుడు బీసీ రిజర్వేషన్ల సర్వే పూర్తవుతుందా? లోకల్ ఎలక్షన్లు ఎప్పుడొస్తాయా అని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి.