05-04-2025 12:28:55 AM
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్,(విజయక్రాంతి): భోలక్ పూర్ గంగపుత్ర సంఘం నూతన అధ్యక్షుడిగా కాడబోయిన కొండల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను మర్యాదపూర్వకంగా కలిసి భోలక్ పూర్ గంగపుత్ర సంఘం నూతన కమిటీని కాడబోయిన కొండల్ ఎమ్మెల్యేకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ కుల సంఘాలు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తూ సంఘం బలోపేతానికి ఐక్యత కొరకు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భోలక్ పూర్ గంగపుత్ర సంఘం మహిళా కమిటీ అధ్యక్షురాలు గంగా, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు గోవింద్ రాజ్, బాబురావు, సంఘం నాయకులు స్వప్న, సరిత, రాధిక, పద్మ, కవిత, గోపాల్, అశోక్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.