ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): బీసీలను రాజకీయంగా ప్రలోభపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనను తెరమీదకు తెచ్చిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ విమ ర్శించారు.
శుక్రవారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో మాట్లాడు తూ.. బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటివరకు కులగణన చేపట్టకపోడానికి కారణం కాంగ్రెస్సేనని.. నెహ్రూ నుంచి రాజీవ్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల విషయంలో అవే తప్పిదాలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు బీసీల పట్ల రేవంత్ ప్రభుత్వం కపట ప్రేమ ఒలకబోస్తున్నదన్నారు.
దేశంలో దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కుటుంబంతోనే బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రేవంత్ క్యాబినెట్‌లో ఎంత మంది బీసీలు ఉన్నారని ప్రశ్నించారు.
కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం కులగణన రిపోర్ట్ ను ఎందుకు బయటపెట్టలేదని, సర్వేలకు వందల కోట్లు ఖర్చు చేయడమే మోడలా అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. బీహార్‌లో బీజేపీ -జేడీయూ ప్రభుత్వం కులగణన చేపట్టి, సర్వేను బహిర్గతం చేసిందని రిజర్వేషన్లు పెంచారని స్పష్టం చేశారు.