పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సూచన
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా చేపట్టిన కులగణనను పార్టీ శ్రేణులు అత్యంత ప్రాధాన్య అంశం గా భావించి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు. శనివారం జిల్లా లలో డీసీసీ ఆధ్వర్యంలో కులగణనపై విస్తృతస్థాయి సమావేశం నిర్వ హించనున్నట్లు తెలిపారు.
శుక్రవా రం గాంధీభవన్‌లో పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి సూచనలను మహేశ్ వివరించారు. దేశంలోనే తొలిసారిగా, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం కులగణనను చేపట్టిందని, ఈ నెల 6 నుంచి గ్రామాల్లో గణన ప్రారంభమవుతుందన్నారు. పార్టీ తరఫున సమాచారం అందిస్తామన్నారు.
శనివారం నిర్వహించే సమావేశానికి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, టీ పీసీసీ ఆఫీస్ బేరర్లు, గ్రాంథలయ కమిటీలు, సీనియర్ నాయకులను ఆహ్వానించాలన్నారు.