మేథోమధనంలో వక్తలు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28(విజయక్రాంతి): విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రొ. కే మురళీమనోహర్, సామాజికవేత్త బీఎస్ రాములు తదితర వక్తలు అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘75 ఏండ్ల రాజ్యాంగం, రాజకీయ అంటరానితనంలో బీసీలు’ అనే అంశంపై రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షతన సమా నిర్వహించారు.
ఈ సమావేశానికి దేవ సమ్మయ్య, కొట్టె సత్తయ్యలు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు. ఈ సం వక్తలు మాట్లాడుతూ.. జనంలేని కులాలు బీసీలను విడదీసి ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలు ఇన్నాళ్లు బీసీలలో అనైక్యతను పెంచుతున్నాయని ఆరోపించారు. ఇన్నేండ్లుగా బీసీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. వచ్చే జనాభా గణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోనూ సంపూర్ణంగా సామాజిక, ఆర్థిక కులసర్వేను నిర్వ కాంగ్రెస్ చేసిన కామారెడ్డి డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీలను ఓటుబ్యాంకుగా, సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే పరిగణిస్తున్నారని విమర్శిం బీసీ రాజకీయ సిద్ధాంత వ్యాప్తికి వివిధ రూపాల్లో ప్రణాళికను సిద్ధం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొం సూచించారు. పీఎల్ విశ్వేశ్వర్‌రావు, ప్రొ.నరేంద్రబాబు, ప్రొ.పార్థసారథి, డా.ఎస్ పృథ్వీరాజ్, ప్రొ.భాస్కర్, సొగరబేగమ్, ప్రొ.భాగయ్య, డా.కోరె రాజ్‌కుమార్, డా. లయన్ వేణుమాధవ్ పాల్గొన్నారు