calender_icon.png 17 January, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి

08-08-2024 03:15:01 AM

ఓయూ విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు ౭ (విజయక్రాంతి): అధికారంలోకి వస్తే బీసీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి బీసీలను బీజేపీ మోసం చేసిందని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. బుధవారం ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ఎదుట మండల్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన అన్ని సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో నేటికీ బీసీల స్థితిగతులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకు లు లెనిన్, వికాస్ యాదవ్, శ్రీకాంత్, ప్రకాశ్ ముదిరాజ్, అశ్విన్, రమేశ్, వినయ్‌గౌడ్, అభిలాష్, శంకర్ యాదవ్, నాగరాజు యాదవ్, అనిల్ గౌడ్, విష్ణు యాదవ్ పాల్గొన్నారు.