14-02-2025 12:44:34 AM
ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, ఫిబ్రవరి 13: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన రీ సర్వేను పకడ్బం దీ గా జరపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, కార్యదర్శి అవినాశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
కులగణనలో మిగిలిపోయిన వారు ఈ నెల 16 నుంచి 28 వరకు ఆన్‌లైన్ టోల్ ఫ్రీతో నమోదు చేసుకోవాలని కోరడం సరికాదన్నారు. ఈ నెల 25న బీసీలకు రాజ్యాంగ పరంగా దక్కాల్సిన వాట, డిమాండ్లపై బెంగళూరులో ఓబీసీ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు.