- అదే రోజు ఉదయం క్యాబినెట్ భేటీ
- నేడు బీసీ కులగణన నివేదికపై సబ్ కమిటీ చర్చ
- రేపు వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ రిపోర్టుపై సమావేశం
- మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఈనెల 5న మధ్యాహ్నం బీసీ కులగణనపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. అదే రోజు ఉద యం క్యాబినెట్ సమావేశమై కులగణన నివేదికకు ఆమోదం తెలుపు తుందని చెప్పారు. ఆదివారం కులగణన సర్వే నివేదికను డెడికేటెడ్ కమి షన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సారథ్యంలోని సబ్‌కమిటీకి అందజేయనుంది.
ఈ నేపథ్యంలో శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కులగణన సర్వే, వర్గీకరణ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గకరణకు సంబంధించిన నివేదికలపై ఆదివారం, సోమవారం రెండు సబ్ కమిటీలు చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఆదివారం కులగణనపై సబ్ కమిటీ విస్తృతంగా చర్చించనున్నట్లు చెప్పారు. సోమవారం ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ తన నివేదికను సబ్ కమిటీకి అందజేస్తుందని, అనంతరం దానిపై చర్చ ఉంటుందని చెప్పారు. ఈ రెండు నివేదికలపై 5న క్యాబినెట్ మీటింగ్‌లో చర్చిస్తామన్నారు.
అదేరోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి కులగణన నివేదికను ప్రవేశపెట్టి చర్చిస్తా మన్నారు. ప్లానింగ్ శాఖ విజయవంతంగా సర్వేను పూర్తి చేసినట్లు చెప్పారు. సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.