calender_icon.png 22 February, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో నేటి నుంచి కులగణన రీసర్వే

16-02-2025 11:34:56 AM

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కులగణనలో పాల్గొనని వారి వివరాల నమోదుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మరో అవకాశమిచ్చింది. నేటి నుంచి ఈ నెల 28 వరకు వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. కులగణన సర్వేలో పాల్గొనని 3,56,323 కుటుంబాలకు అవకాశమిచ్చింది. కులగణన వివరాల నమోదు కోసం జీహెచ్‌ఎంసీ(Greater Hyderabad Municipal Corporation) ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.

(టోల్ ఫ్రీ నం 040-21111111) అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు కాల్ సెంటర్‌ సేవలు పనిచేయనున్నాయి. ఫోన్ చేసినవారి ఇంటికెళ్లి ఎన్యుమరేటర్లు(Enumerators) వివరాలు నమోదు చేయనున్నారు. ఎంపీడీవో, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకునే ఏర్పాట్లు చేశారు. https://seeepcsurvey.cgg.gov.in లో సర్వే ఫామ్ లభ్యం కానుంది. సర్వే ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని ప్రజాపాలన సేవకేంద్రంలో ఇచ్చే అవకాశముంది.