18-02-2025 01:42:17 AM
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ.హనుమంతరావు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 ( విజయక్రాంతి) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచన మేరకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కులగణన చేపట్టారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ.హనుమంతరావు అన్నా రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడమే లక్ష్యంగా సీఎం పని చేస్తున్నారని తెలిపారు.
సోమవారం కర్ఫూరి ఠాగూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోషలిస్టు నాయకుడు, జన నాయక్ కర్ఫూరి ఠాకూర్ 37వ వర్దంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. బీహార్ ముఖ్యమంత్రిగా కర్పూరి ఠాకూర్ చేసిన సేవలను కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ది, సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో వీహెచ్ సహా సీనియర్ పాత్రికేయులు వినయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.