07-02-2025 12:12:35 AM
ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపిన నీలం మధు ముదిరాజ్
పటాన్‌చెరు, ఫిబ్రవరి 6 : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేసిన కులగణన చారిత్రాత్మకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా జనాభా ప్రాతిపదికన బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టిందన్నారు.
గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో నీలం మధు సీఎం రేవంత్రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందింజేసి తెలంగాణ బీసీల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.