కుటుంబ సర్వేలో 75 ప్రశ్నలా?
- ఆర్థికపరమైన అంశాలను మినహాయించాలి
- కులగణనకు బీఆర్‌ఎస్ పార్టీ అనుకూలమే
- రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా?
- మేము కాంగ్రెస్ వైఫల్య వారోత్సవాలు నిర్వహిస్తాం
- పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాంబులశాఖ ఇస్తే బెటర్
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
హైదరాబాద్/జనగామ, నవంబర్ 10 (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల్లో బీసీల ఓట్లకు గాలం వేసేందుకే కాంగ్రెస్ ప్రభు త్వం కులగణన చేపట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తం గా నిర్వహిస్తున్న కులగణనలో 75 ప్రశ్న లు వేయడం విడ్డూరంగా ఉందని అన్నా రు. వెంటనే సర్వేలోని విచ్చలవిడి ప్రశ్నలను కుదించాలన్నారు. కులగణనను బీఆర్‌ఎస్ పార్టీ స్వాగతిస్తున్నదని స్పష్టంచేశారు. హనుమకొండలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
బ్యాంకుల్లో డబ్బెం త ఉందని అడుగుతున్నారని, ఇటువంటి ఆర్థికపరమైన అంశాలను సర్వే నుంచి మినహాయించాలని కోరారు. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే తెలంగాణలో కులగణన చేస్తున్నారని విమర్శించారు. కామా రెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాదైనా దాని ఊసెత్తని సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పు డు కులగణన పేరుతో బీసీలను మరోసారి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బీసీ బంధు, దళిత బంధు వంటి స్కీంలను ఎత్తేసి ఇప్పుడు బీసీ జపం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తిదారుల గొంతు కోశారని మండిపడ్డారు. పదే పదే బాంబులు పేలుతాయని చెప్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బాం బుల శాఖను కేటాయించాలని ఎద్దేవా చేశారు.
ఏం సాధించారని విజయోత్సవాలు?
రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ సర్కారు తీరును కేటీఆర్ దుయ్యబట్టారు. ఏడాది కాలంలో ఏం సాధించారని విజయోత్సవాలు నిర్వహిస్తోందని ఆ పార్టీని ప్రశ్నించారు. ఈ విజయోత్సవాలకు నిరసనగా త్వరలో తాము కూడా కాంగ్రెస్ పరి పాలన వైఫల్య వారోత్సవాలను నిర్వహిస్తామని వెల్లడించారు.
‘ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణ బతుకు చీలికలు, పీలిక లే’ అన్నట్టు పరిస్థితి మారిందని విమర్శించారు. ఆదివారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ సర్కారు నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదని, కుంభకోణాల కుంభ మేళా అని చురకలు వేశారు. ప్రతి హామీని పాతరేసినందుకు ప్రజావంచన వారోత్సవా లు నిర్వహించాలని ఎద్దేవాచేశారు.
మూసీ లో లక్షన్నర కోట్ల మూటల వేట, కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట, బావమరిదికి అమృత్ టెండర్లను, కొడుకులకు వేల కోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే సీఎం, మంత్రు లు జరుపుకోవాల్సింది కరప్షన్ కార్నివాల్ అంటూ విరుచుకుపడ్డారు. పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్‌గా కాంగ్రెస్ సర్కార్ మారిం దన్నారు.
సంతోషం లేని సందర్భాలకు చిరునామా రేవంత్ పాలనని, ఏ ముఖం పెట్టుకు ని విజయోత్సవాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. హామీలు అమలుచేయకుండా జనం సొమ్ముతో 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారని ఆరోపించారు. రుణమాఫీ, పెట్టుబడి సాయం అందక రైతులు దుఖం లో ఉంటే ప్రభుత్వం రూ.100 కోట్లతో విజయోత్సవాలు చేసుకోవడమేమిటని నిలదీశా రు.
హైడ్రా, మూసీ బాధితులు బాధలో ఉంటే బాజా భజంత్రీలతో పండుగ చేసుకుంటారా అని ప్రశ్నించారు. ఆడబిడ్డలు రక్షణ లేక అల్లాడుతుంటే విజయోత్సవాల పేరిట విర్రవీగడం మానుకోవాలని హితవు పలికారు. పింఛన్ల పెంపు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే దయలేకుండా దావత్‌లు చేసుకుంటారని విమర్శించారు.
బీఆర్‌ఎస్ భర్తీచేసిన ఉద్యోగాల ప్రక్రియను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం నయవంచనే అవుతుందని అన్నారు. రేవంత్‌కు పాలనపై పట్టు కాదు.. ఈ ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమే లేదని చెప్పారు. విజయోత్సవాలు అంటే ఏంటో కూడా తెలియని ఈ అసమర్థ పాలకులకు ఆ పదాన్ని వాడే హక్కే లేదని స్పష్టంచేశారు.