09-02-2025 01:15:11 AM
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.మురళీధర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి (విజయక్రాంతి): తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన దేశానికే ఆదర్శమని కాం గ్రెస్ సీనియర్ నాయకుడు కె.మురళీధర్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటూ హిమాయత్ నగర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి దంపతుల కు ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు.
మురళీధర్ మాట్లాడుతూ.. 50 రోజుల్లోనే సర్వే పూర్తిచేసి కచ్చితమైన లెక్కలు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. సీఎం, మంత్రులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో విద్య, ఉద్యోగరంగాల్లో అమలు చేయబోయే రిజర్వేషన్లకు ఈ లెక్కలు ఉపయోగపడుతాయన్నారు.