calender_icon.png 6 February, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టం

06-02-2025 05:23:31 PM

హుజూర్ నగర్: కుల గణన దేశ చరిత్ర లోనే చారిత్రాత్మక ఘట్టం అని, సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకంగా బీసీల కులగణన నిర్వహించి అసెంబ్లీలో కులగణన జాబితాను ప్రజలముందు ఉంచే ప్రక్రియలో కీలక పాత్ర పోషించటంలో మన స్థానిక శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత కెప్టెన్ శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని, రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల అందరికీ గర్వకారణం అని అన్నారు. బీసీ  లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం సీట్లు అమలుకు మంత్రి ఉత్తమ్ కృషి చేయాలన్నారు.

భవిష్యత్తులో రాష్ట్ర వనరులను, సంపదను, కులగణన సర్వే ప్రకారం అందించవచ్చునని రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ అవకాశాలను ఈ కులగుణంకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం ప్రియతమ నాయకుల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ లో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.