- బీసీ సబ్‌ప్లాన్ పెట్టి.. రూ.25 వేల కోట్లు కేటాయించాలి
- పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): తెలంగాణలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన కులగణన సర్వే యావత్ దేశానికి దిక్సూచిలా నిలుస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు కితాబిచ్చారు. రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు సీ ఎం రేవంత్‌రెడ్డి కులగణన చేశారని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మా దిరిగానే బీసీ సబ్‌ప్లాన్ పెట్టి రూ.25 వేల కోట్ల వరకు బడ్జెట్‌లో కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డికి వీహెచ్ విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా తో మాట్లాడుతూ..
జనాభా ప్రతిపాదికన కులగణన జరగాలని ప్రధా నమంత్రి నరేంద్రమోదీని పలుమార్లు కలిసినా ప్రయోజనం లేకుం డా పోయిందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నదే రాహుల్‌గాంధీ ఆలోచన అని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.