13-02-2025 01:26:27 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): కులగణన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదని, వారి కోసం మళ్లీ రీ సర్వే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్ ఆక్షేపించారు. మళ్లీ మొత్తం సర్వే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణన సర్వే అంతా తప్పుల తడకగా ఉందని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.
ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. తెలంగాణలో 3 కోట్ల 35 లక్షలకు పైగా ఓటర్లున్నారని.. మొ త్తం జనాభా 4 కోట్ల 30 లక్షలు దాటుతుందన్నారు. ఆధార్ కార్డులున్న వారి సంఖ్య 3 కోట్ల 95 లక్షలని...
కానీ కులగణన సర్వేలో తెలంగాణ జనాభాను 3 కోట్ల 70 లక్షలుగా కుదించడం పెద్ద బూటకమన్నారు. కులగణనలో లేని 60 లక్షల మందికిపైగా ప్రజలు ఏమైనట్లని ప్రశ్నించారు. బీసీ సామాజికవర్గంలోని వివి ధ కులాలకు చెందిన జనాభాను ఉద్ధేశర్వకంగానే తగ్గించే కుట్ర జరుగుతున్నట్టు ఆరోపించారు.