calender_icon.png 6 May, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో కులగణన దేశానికే దిక్సూచి

10-04-2025 01:26:44 AM

50% రిజర్వేషన్ల గోడను బద్దలుకొడుతాం 

కులగణనతో రిజర్వేషన్లు పంచుతాం

  1.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన  
  2.  అమెరికా సుంకాలపై ప్రధాని మౌనమెందుకు? 
  3.  ఆర్థిక తుఫాన్ రాబోతుంది.. 56 అంగుళాల ఛాతీ ఎక్కడ..? 
  4.  ఏఐసీసీ జాతీయ సదస్సులో అగ్రనేత రాహుల్

అహ్మదాబాద్, ఏప్రిల్ 9 : రిజర్వేషన్లపై 50శాతం పరిమితి గోడను తాము బద్దలుకొడుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ చేసిన కులగణ నను తాము అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా చేపడుతామని స్పష్టం చేశారు.

భారత్‌ను ఆర్థిక తుఫాన్ తాకబోతోందని, అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు.. ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 84వ జాతీయ సదస్సు “న్యాయపథ్: సంకల్ప్, సమర్పణ్, సంఘర్ష్‌”లో భాగంగా రెండోరోజు బుధవారం ఆయన ప్రసంగించారు.. దేశంలో సమస్యలు పరిష్కరించాలంటే దేశాన్ని ఎక్స్‌రే తీయాలని చెప్పారు.

దళితులు, ఆదివాసీల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. ఆ వర్గాలకు దేశంలో న్యాయం జరుగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. బీసీల రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బిల్లు కేంద్రానికి పంపినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనిమండిపడ్డారు.

తెలంగాణలో కులగణన విజయవంతంగా నిర్వహించారని, కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణలో 90శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని, అయితే ఆ రాష్ట్ర సంపదలో మాత్రం వారికి తగిన భాగస్వామ్యం లేదన్నారు. వారి జనాభాకు తగ్గట్టు సంపదలోనూ తగిన వాటా అవసరమని రాహుల్ చెప్పుకొచ్చారు.

మోదీ ఎక్కడ దాక్కున్నారు?

భారత్‌పై అమెరికా సుంకాలు విధిస్తున్న ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారని రా హుల్ ప్రశ్నించారు. మోదీ గత అమెరికా పర్యటనలో ఆయన స్నేహితుడిగా పిలుచుకునే ట్రంప్.. కౌగిలింతలు ఉండవని, కొత్త సుంకాలు ఉంటాయని ప్రకటించారని, దాని కి మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఆర్థిక తుఫాన్ వస్తోందని, అది లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు.

సుంకాలపై ప్రజల దృష్టి ని మరల్చడానికి రెండు రోజుల పాటు పార్లమెంట్‌లో డ్రామా నడిపించారని విమర్శిం చారు. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మొ హమ్మద్ యూనస్‌తో ప్రధాని మోదీ ఇటీవల జరిగిన సమావేశాన్ని రాహుల్ ప్రస్తావి స్తూ.. బంగ్లాదేశ్ నాయకుడు ప్రతికూల వ్యా ఖ్యలు చేసినా ప్రధాని మోదీ వింటూ కూర్చున్నారని.. ‘56 అంగుళాల ఛాతీ ఎక్కడ..?’ అని ప్రశ్నించారు.

కీలక పరిశ్రమలన్నీ ఆ ఇద్దరికే..

 ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని మోదీ ఒక్కొక్కటిగా అమ్ముతున్నారని, ఇద్దరు వ్యాపారవేత్తలకే అన్నింటినీ అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఎయిర్‌పోర్టులు, గను లు, సిమెంట్, స్టీల్ సహ కీలక పరిశ్రమలన్నీ ఓ పారిశ్రామికవేత్తకే కట్టబెట్టారన్నారు. మ హారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అక్రమాల ద్వారా గెలిచిందని, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ రోజూ రా జ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉన్నాయన్నారు. దేశంలో కులగణన చేపట్టాలని ప్రధాని మోదీని కోరితే ఆయనతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ కూడా తిరస్కరించిందని తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛపై దాడే అని వివరించారు.

బ్యాలెట్ కోసం యువత ఉద్యమిస్తారు: ఏఐసీసీ చీఫ్ ఖర్గే

ప్రపంచంలోని అన్ని దేశాలు ఈవీఎంలను వదిలేసి బ్యాలెట్ వైపు వెళ్తున్నాయని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నా రు. ఈవీఎంల ద్వారా ఎన్నికలంటేనే మోసమని చెప్పారు. బ్యాలెట్ కావాలని యువత ఉద్యమించేందుకు సిద్ధమవుతోందన్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఈవీఎం మోసాలతోనే ఎన్డీఏ అధికా రంలోకి వచ్చిందని ఆరోపించారు. 11 ఏం డ్లుగా అధికార బీజేపీ మోసానికి పాల్పడుతోందని ఆరోపించారు.

కొందరు ఆశ్రిత పెట్టుబడిదారులకే వనరులను అప్పగిస్తోందని, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేసి వెళ్లిపోతుందని ఆరోపించారు. భారత్‌పై అమెరికా సుంకాలపై పార్లమెంట్‌లో చర్చించాలని తాము పట్టుబట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

పార్టీలో చురుకుగా పనిచేయనివారు పదవీ విరమణ చేయాలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగో పాల్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ము ఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొ న్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నేతలకు నివాళి..

అంతకుముందు 2023 ఫిబ్రవరి రాయ్‌పూర్ సమావేశాల తర్వాత మరణించిన కాంగ్రెస్ సభ్యులకు కాంగ్రెస్ సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. గత డిసెంబర్‌లో మృతిచెందిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఘన నివాళి అర్పించారు.

గుజరాత్‌లో అధికారమే లక్ష్యం..

1995 నుంచి బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంపై దృష్టిసారించాలని ఏఐసీసీ సమావేశం ప్రత్యేక తీర్మానం ఆమో దించింది. ఈ విషయంపై పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ మాట్లాడుతూ.. ఏఐసీసీ సమావేశంలో రాష్ట్ర నిర్దిష్ట తీర్మానాన్ని తీసుకురావడం పార్టీ చరిత్రలో ఇదే మొదటి సారన్నారు. “గుజరాత్‌లో కాంగ్రెస్ ఎందుకు అవసరం”అనే శీర్షికతో “కొత్త గుజరాత్. .కొత్త కాంగ్రెస్‌” నినాదంతో తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ వ్యూహాన్ని ఈ తీర్మానం వివరిస్తుందని చెప్పారు.

ఖర్గేను పక్కన ఎందుకు కూర్చొబెట్టారు: బీజేపీ విమర్శలు

సబర్మతి ఆశ్రమంలో జరుగుతున్న ప్రార్థ న కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పక్కన ప్రత్యేక కుర్చీపై కూర్చొ బెట్టి అవమానించారని కాంగ్రెస్‌పై బీజేపీ వి మర్శలు చేసింది. రాహుల్, సోనియాగాంధీ మధ్యలో కూర్చుని ఉన్న వీడియోను ప్రదర్శిస్తూ పార్టీ అధ్యక్షుడు, వృద్ధుడైన ఖర్గేను మధ్యలో ఎందుకు కూర్చొబెట్టలేదని బీజేపీ జాతీయ ఐటీ విభాగం ఇన్‌చార్జ్ అమిత్ మాల్వియ ప్రశ్నించారు.