calender_icon.png 18 November, 2024 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జార్ఖండ్‌లోనూ కులగణన

18-11-2024 01:26:20 AM

  1. అధికారంలోకి రాగానే 6 హామీల అమలు
  2. ఖనిజ సంపదపై బీజేపీ కన్ను
  3. ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణలో కులగణన చేపడుతు న్నామని, జార్ఖండ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా సర్వే నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే ఏడు హామీలను అమలు చేస్తామన్నారు. జార్ఖండ్ ప్రజలపై బీజేపీకి ప్రేమే లేదని విమర్శించారు.

జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బొకారో నియోజకవర్గం శివండి, దుంది బజార్, ఆజాద్ నగర్ బ్లాకుల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. జార్ఖండ్‌లోని ఖనిజ సంపదపై బీజేపీ కన్నేసిందని విమర్శించారు. అపార సంపదను అదానీ, అంబానీలకు అప్పగించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు.

తాము అధికారంలోకి వస్తే జనాభా నిష్పత్తి ప్రకారం సంపదను పంచుతామన్నారు. రాష్ట్ర సంపద, వనరులను కాపాడేందుకు ఇండియా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లోనూ తెలంగాణ తరహా పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.