డా.ముచ్చుకోట సురేష్‌బాబు :
రాష్ట్రంలో సమగ్ర కులగణన మూడు నెలల్లో పూర్తి చేసి అం దుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇ వ్వాలని తాజాగా హైకోర్టు తెలంగాణ ప్ర భుత్వాన్ని ఆదేశించింది. కులగణన తర్వాత స్థానిక సంస్థలు, పంచాయితీ ఎన్నికలు పె ట్టి రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ ఎన్డ్డీఏ ప్రభుత్వం కూడా సత్వరమే సమగ్ర కులగణన చేపట్టి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు చేయూత నివ్వాలి. బీసీ రక్షణ చట్టం, బీసీ సాధికారత అని వల్లె వేస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ మేరకు వెంటనే స మగ్ర కులగణన చేపట్టాలి. తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మే రకు అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. ఈ కులగణన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగీవ్రంగా ఆమోదించింది.
కొత్త లబ్ధిదారులకు న్యాయం
రాష్ట్రంలో ఆయా వర్గాల వారీగా ప్రజ ల వివరాలు, వారి ఆర్థిక స్థితిగతులు, వా ళ్లు పొందుతున్న సంక్షేమ పథకాలకు సం బంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభు త్వం సర్వేద్వారా సేకరించనుంది. ఎంతమంది ఏ సామాజిక వర్గానికి చెందిన వా రు ఉన్నారు? వారి ఆర్థిక పరిస్థితితోపాటు విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నా యి? వంటి పూర్తి వివరాలు సేకరించ ను న్నారు. దీనివల్ల ప్రస్తుతం అమలయ్యే సం క్షేమ కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకే చేరుతున్నాయా లేదా అవకతవకలు ఏమై నా జరుగుతున్నాయా? అన్న విషయాలపై ఓ స్పష్టత వస్తుంది.
అంతేకాక, ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకాల విషయం లో ఏ సామాజిక వర్గానికి ఎంత న్యాయం చేయాలన్న సమాచారమూ అందుతుంది. దీంతో అన్యాయానికి లోనైన వర్గాలకు న్యాయం చేకూర్చే అవకాశం లభిస్తుంది. వీటితోపాటు రాజకీయ పరంగా ఏ సామాజిక వర్గం వెనుకబడి ఉంది? ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది? వంటి అంశాలపైనా స్పష్టత వస్తుంది.
సంఘటితం కావాలి
ఆధిపత్య శక్తులు తమ దామాషాకు మూడు నాలుగు రెట్ల అవకాశాలను పొం దుతున్న నేపథ్యంలో, గత ఏడు దశాబ్దాల రాజ్యాంగ పాలనలో ఎవరి హక్కుల కో సం వారు, ఎవరి ఆధిపత్యం కోసం వారు పరిమితం అయిపోతున్నారు. ఇతరులకు కరివేపాకులాగే మిగిలిపోతున్న బీసీ వర్గం, తమ హక్కులు తాము దక్కించుకోవాలం టే ప్రధానంగా చేయవలసింది ఏమిటి? అ నే దానికి సరైన సమాధానం కావాలి. బీసీ కులాల అస్తిత్వ నిర్మాణం చిక్కబడాలి. వీరి మధ్య అంతర్గత ఐక్యత పెరగాలి. దీనికి వీ లుగా దామాషా హక్కులకోసం సమిష్టి కృ షి కొనసాగిస్త్తూనే, దొరుకుతున్న అవకాశా లు బీసీ కులాల మధ్య సమానంగా పంపి ణీ జరగాలి. సరైన నాయకత్వ నిర్మాణం బీసీలకు కావాలి.
జాతీయ స్థాయిలో బీసీలకు సరైన గుర్తింపు లభించాలి. అది జాతీ య స్థాయిలో బీసీ సంఘాన్ని వ్యవస్థీకృ తం చేయకుండా వీలు కాదు. వ్యవస్థీకృత నిర్మాణం ద్వారా, బీసీల కీలక సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు జరగాలి. అంతిమంగా బీసీ నాయకత్వంలో బలమైన రా జకీయ వేదిక నిర్మాణం జరగాలి. తద్వారా జాతీయ స్థాయిలో బీసీలు రాజ్యాధికారం చేపట్టాలి. దాంట్లో ఎవరి దామాషా హక్కు లు వారికి చెందాలి. అదే సమసమాజ స్థాపనకు దోహదం చేస్తుంది. బీసీలకు చెం దవలసిన అవకాశాలు వారికి దొరకడానికి ఇలాంటి కృషి చాలా అవసరం.
ఉప కులాలుగా విడిపోయిన బీసీలు ఐ క్యం కావాలి. కేవలం 8 శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిం చిన బీజేపీ ప్రభుత్వం 57 శాతం ఉన్న బీసీలను 27 శాతం రిజర్వేషన్లకు పరిమితం చే సింది. తరతరాలుగా, ఓబీసీలు విద్య, రాజకీయాలు, వ్యాపారం సహా వివిధ రంగాల లో అణగదొక్కబడ్డారు. విద్య, వైద్యం ఉపా ధి రంగాలలో ప్రభుత్వాల చేయూత లేకపోవడంతో అప్పులపాలై జీవితాలు దుర్భ రంగా తయారయ్యాయి.
ఓబీసీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వారి లో 70 శాతం ఇప్పటికీ పేదరికంలో జీవిస్తున్నారు. స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేవు. వివక్ష, హింసకు గురవుతున్నారు. ఓబీసీల ఆందోళనలను పరిష్కరించడంలో మరికొందరు ఓబీసీ కమ్యూనిటీలను చేర్చడానికి రిజర్వేషన్ విధానాన్ని విస్తరించాల నీ వాదిస్తున్నారు. మరికొందరు రిజర్వేషన్లు కులం లేదా కమ్యూనిటీ కంటే ఆర్థిక ప్రమాణాలు ఆధారంగా ఉండాలని వాదిస్తున్నారు.
బహుముఖ సమస్య
దేశంలో బీసీలది సంక్లిష్టమైన బహుముఖ సమస్య. వారు వివిధ రంగాలలో గ ణనీయమైన పురోగతిని సాధించినా అనేక సవాళ్లు మిగిలిఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి కేవలం నిశ్చయాత్మక కార్యాచరణ విధానాలు మాత్రమేకాక ఓబీసీలను చారిత్రాత్మకంగా అట్టడుగున ఉంచిన నిర్మాణా త్మక అసమానతలు, వివక్షలను పరిష్కరించే చర్యలతో కూడిన సమగ్ర విధానం అవసరం. బీసీ కులాల అభివృద్ధికి పాటుపడుతున్నామని ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆచరణలో ఈ కులాల అ భివృద్ధికి కనీస చర్యలు తీసుకోవడం లే దు. బీసీ కార్పొరేషన్ల ద్వారా పది పైసలు ఉపయోగం కూడా లేదు.
అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతులు ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక రంగా ల్లో అభివృద్ధి చేయవలసిన రాజ్యాంగ బా ధ్యతను ఈ ప్రభుత్వం విస్మరిస్తోంది. స మాజం ఎప్పటికప్పుడు మారుతున్నది. ప్ర జల్లోనూ దానికి అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. అన్ని రంగాల్లో యాంత్రీకరణ పెరుగుతున్నది. ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, వ్యవసాయ, సాంస్కృతిక రంగాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీ అన్ని రంగాలకూ విస్తరిస్తున్నది. ఈ పరిణామ క్రమంలో కులహా తమ ఆస్తిత్వాన్ని కో ల్పోతున్నాయి. ఇంతవరకు ఈ వృత్తులపై నే ఆధారపడిన కులాలు, వర్గాలకు యాం త్రీకరణ-, కార్పొరేటీకరణ దక్కాలి.
కానీ, ప్రస్తుత వ్యవస్థలో అలా జరగడం లేదు. స్టీల్-, ఐరన్ పరిశ్రమలతో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి కులాలు తమ వృత్తులను కోల్పోయాయి. ప్లాస్టిక్ పరిశ్ర మ కారణంగా మేదరి, కుమ్మరి వృత్తులు మరుగున పడ్డాయి. జేసీబీలు, హిటాచీ మె షీన్లతో వడ్డెర్ల బతుకులు ఆగమై కూలీలు గా మారారు. ట్రాక్టర్లు-, సా మిల్లులు రావడంతో వడ్రంగి, కమ్మరి పని దెబ్బ తింది. అలాగే, మిగిలిన కులవృత్తులు కూడా. అ సెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతి దరఖాస్తుదారునికి సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రక టించారు. మరోవైపు ఆరేళ్లుగా కొత్త రుణా ల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. దీం తో దరఖాస్తు చేసుకోవడానికి లక్షలమంది ఎదురు చూస్తున్నారు. బీసీ కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. కులాల స మస్యలపై అవగాహన ఉన్నవారు తమకు కావలసిన పథకాలను డిజైన్ చేయగలరు.
సబ్సిడీ రుణాలు ఇవ్వాలి
కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల నియామ కం అస్తవ్యస్తంగా తమ చెప్పుచేతల్లో ఉన్న వారికి ఇచ్చారు. సబ్సిడీ రుణాలు ఇవ్వాల ని ప్రభుత్వాన్ని కోరినా స్పందించడం లే దు. కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయ డం ద్వారా ఆయా కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను కిందిస్థాయిలో అర్థం చేసుకుని పరిష్కరించే అవకాశం కలుగుతుంది. మిగతా కులాలకు ఎంబీసీ కార్పొరే షన్ ద్వారా, సంచార జాతుల కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటే ఈ కులాల్లో స మగ్ర అభివృద్ధికి పునాదులు పడతాయి.
మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బతో కుల వృత్తులు దెబ్బతిన్నాయి. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇవ్వకపోగా, బీసీలకు రూ.లక్ష,- రూ.2 లక్షల రుణాలు ఇవ్వడానికి బ్యాంకులూ ముందు కు రావడం లేదు. అందుకు బ్యాంకర్ల స మావేశం ఏర్పాటు చేసి ప్రతి దరఖాస్తుదారుకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పేదరికం లేని సమాజ నిర్మాణం జరగాలంటే జాతి, వనరులు, సంపద, అధికారం అన్ని వర్గాలకూ సమానంగా దక్కాలి. శ్రమ సంస్కృతి పెరగాలి. మానవ వనరులు పూర్తి స్థాయిలో వాడుకోవాలి. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కాలి.
వ్యాసకర్త సెల్: 9989988912