calender_icon.png 26 November, 2024 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన దేశంలో చరిత్ర సృష్టిస్తది

06-11-2024 01:19:25 AM

  1. రాహుల్‌గాంధీ మాట ఇస్తే అది శాసనం 
  2. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాం తి): తెలంగాణలో కులగణన చరిత్రాత్మకం కాబోతుందని, రాహుల్‌గాంధీ మాట ఇస్తే అది శాసనం అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం కుల గణనకు ముందుకు వెళ్లుతున్నట్లు  చెప్పారు.

కులగణన తెలంగాణ దేశంలో ఆదర్శంగా నిలవబోతోందన్నారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని రాజీవ్‌గాంధీ ఐడి యాలజీ సెంటర్‌లో కులగణపై జరిగిన సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ  భారత్ జోడో యాత్ర ఎంతో మంది ని కదిలించిందన్నారు. 

ప్రభుత్వ బాధ్యతగా సర్వే..

సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యో గ, ఉపాధి కులగణన సర్వేను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని పేర్కొన్నారు. పౌరసమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ తెలంగాణకు రావడం గొప్ప విషయమన్నారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే ఏ నాయకునికైనా గుండె ధైర్యం కావాలని, సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో రాహుల్ గాంధీ వచ్చారని తెలిపారు.

మాటలు కాదు చేతలతో తమ పాలన చూపించాలనేది ఆయన ఆలోచన అని అన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని అడుగు ముందుకు వేశా రని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చడమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు.

ఇటీవల నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షలో 31,383 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారని, అందులో ఓసీలు- 3,076 (9.8శాతం), ఈడబ్ల్యూఎస్- 2,774 (8.8 శాతం), ఓబీసీలు- 17,921 (57.11 శాతం), ఎస్సీలు- 4,828 (15.3శాతం), ఎస్టీలు 2,783 (8.8శాతం) మంది ఉన్నట్లు చెప్పా రు. మనది రైజింగ్ తెలంగాణ అని, దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కులగణ న పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని తెలిపారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.