calender_icon.png 3 February, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50 రోజుల్లోనే కులగణన పూర్తి

03-02-2025 01:37:41 AM

* సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి చొరవతో వేగవంతం 

* 3.70 కోట్ల జనాభా.. సర్వేలో పాల్గొన్న వారి సంఖ్య 3.54 కోట్ల మంది 

* అతి తక్కువ ఖర్చు.. తక్కువ రోజుల్లో దేశంలోనే అతిపెద్ద సర్వే

* ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ సాకారం

* బీసీ కులగణన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాం తి): సామాజిక-, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో బీసీలకు రాజ్యాంగబద్ధంగా న్యాయం చేయాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం కేవలం 50 రోజుల్లో కులగణన పూర్తి చేసిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి, బీసీ కులగణన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు.

హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆదివారం బీసీ డెడికేటెడ్ కమిషన్ రూపొందించిన నివేదికపై చర్చించిన తర్వాత ఆయ న మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సిం హ, పొన్నం ప్రభాకర్, ప్లానింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, రాష్ట్ర నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కులగణనపై ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామని, ఇదొక చారిత్రక సందర్భమని అభివర్ణించారు. కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని స్పష్టం ంచేశారు. రాష్ట్రప్రభుత్వం కులగణన చేయాలని గతేడాది ఫిబ్రవరి 16న తీర్మానం చేసిందని, నవంబర్ 9న కులగణన ప్రారంభమైందని వెల్లడించారు.

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చొరవతోనే సర్వే సత్వరం పూర్తయిందని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తం గా 3.70 కోట్ల జనాభాలో 3.54 కోట్ల మం ది సర్వేలో పాల్గొన్నట్లు వెల్లడించారు. దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కి స్తుందని, కానీ.. ఏనాడూ కులగణన చేపట్టలేదన్నారు. ఫలితంగా అన్నివర్గాలకు న్యాయం జరగడం లేదని అభిప్రాయపడ్డారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో జరిగిన అతిపెద్ద సర్వే తమ ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ డేటాతో సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేసేందుకు వీలైవుతుందని వివరించారు. సర్వే నిర్వహణకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, కొందరు న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు వేశారని గుర్తుచేశారు. అయినప్పటికీ మొక్కవోని సంకల్పంతో సర్వే పూర్తి చేశామన్నారు.

బిహార్ కులగణనకు ఆరు నెలలు పట్టిందని, అందుకు అక్కడి ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కానీ.. తమ ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో కేవలం 50 రోజుల్లో సర్వే పూర్తి చేసిందని స్పష్టం చేశారు. సర్వే ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కులగణన తెలంగాణ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయంగా నిలుస్తుందని కొనియాడారు. వైద్యారోగ్యశాఖ మంత్రి మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. కులగణనతో సామాజిక న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మా ట్లాడుతూ.. ఇలాంటి సర్వేలు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో సర్వేకు.. తాజా సర్వేకు తేడా ఇదే..

బీఆర్‌ఎస్ హయాంలో ఒకరోజు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కంటే, తాజాగా కాంగ్రె స్ ప్రభుత్వం చేపట్టిన సర్వే హేతుబద్ధత ఉంద ని అధికారిక వర్గాలు అభిప్రాయపడుతున్నా యి. నాటి సర్వేకు ఎలాంటి ప్రమాణాలు లేవ ని, ఈ సర్వే పక్కా శాస్త్రీయతతో జరిగిందని వెల్లడిస్తున్నాయి. ఒక కుటుంబంలో భర్త, భార్య, కారు, బైక్, సామాజికవర్గం, ఇల్లు.. ఇలా ప్రతి అంశానికి ఒక కోడ్ కేటాయించడం సర్వే ప్రత్యేకత అని చెప్తున్నాయి.

రేపు క్యాబినెట్, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

* కులగణన నివేదికపై కీలకమైన చర్చ

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన కులగణన నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. అనంతరం ఇదేరోజు 11 గంటలకు అసెంబ్లీలో ప్రత్యే క సమావేశం జరుగనున్నది. సభలో మంత్రులు కులాల వారీగా జాబితాను వెల్లడించే అవకాశం ఉంది.

తర్వాత రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. మరోవైపు ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయకమిషన్ సిద్ధం చేసిన నివేదికను సోమవారం కేబినెట్ సబ్ కమిటీకి అందిచనున్నది.

పక్కా ప్రణాళికతో సర్వే..

పక్కా ప్రణాళికతో పకడ్బందీగా కులగణన చేపట్టామని రాష్ట్ర ప్లానింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. సర్వేకు ముం దే తాము ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన సర్వేలను అధ్యయనం చేశామని వెల్లడిం చారు.  తొలుత నాలుగు జిల్లాల్లో పైలె ట్ సర్వే నిర్వహించామని, ఆ తర్వాతే రాష్ట్రమంతటా నిర్వహించామని స్పష్టం చేశారు.

మేధావులు, రాజకీయ పార్టీల నేతలు, కుల సంఘాల సభ్యులు, సామాజిక సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయా లను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. ఇలా 75 ప్రశ్నలతో సర్వే పత్రం తయారు చేశామని వెల్లడించారు. ఇలాంటి సర్వేను దేశంలో మరే ఇతర రాష్ట్రం చేపట్టలేదని తెలిపారు.