కామారెడ్డి, అక్టోంబర్ 11 (విజయక్రాంతి): కుల సంఘానికి చెందిన స్థలాన్ని చర్చికి ఇవ్వొద్దన్నందుకు ఓ కుటుంబాన్ని కులం నుంచి బ హిష్కరించిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకా రం.. తిమ్మారెడ్డిలోని ఓ కులసంఘానికి చెం దిన స్థలాన్ని కులపెద్దలు చర్చి నిర్వాహకుల కు అమ్మేందుకు సిద్ధపడ్డారు.
దీన్ని ప్రకాశ్‌తో పాటు అతడి కుటుంబసభ్యులు అడ్డుకుంటున్నారు. దీంతో ప్రకాశ్ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. దీంతో బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. నాలుగేళ్ల క్రితం సైతం తనను కులం నుంచి బహిష్కరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.