బస్సును పేకాట స్థావరంగా మార్చుకున్న ముఠా
జూదమాడుతూ ఏడురోజుల విహారయాత్రకు ప్లాన్
పోర్బందర్ హైవేపై పట్టుకున్న పోలీసులు
న్యూఢిల్లీ, ఆగస్టు 6: గుజరాత్లోని ఓ స్నేహతు బృందం ఒక బస్సును కొని అందులో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు. ముందుగా బస్సులోని సీట్లను తొలగించి మధ్యభాగంలో పరుపులు, దిండ్లు వేసి పేకాట స్థావరంగా మార్చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు.. సోమవారం తెల్లవారుఝామున క్రైమ్ బ్రాంచ్ పోలీసులు... రాజ్కోట్ పోర్బందర్ హైవేపై భోడ్ గ్రామ సమీపంలో బస్సును అడ్డగించారు.
దాడిలో బస్సును కిరాయికి తీసుకున్న రాకాసియా సహా మరో 10మందిని అరెస్టు చేసి.. వారి వద్ద రూ.2లక్షల నగదు, ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. బస్సును సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వాస్తవానికి వారు ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సును పేకాట ఆడుకునేందుకు ఎంచుకున్నారు.
అనుకున్నదే తడువుగా అందరూ కలిసి బస్సును అద్దెకు తీసుకొని ఏడురోజుల పాటు బస్సులోనే జూదం ఆడేలా విహార యాత్రకు ప్లాన్ చేశారు. ముందుగా బస్సులోని సీట్లన్నిటినీ తొలగించి పరుపులు వేశారు. డ్రైవర్ను నియమించుకొని అంతా ఒకచోట కూర్చొని బస్సు రన్నింగ్లో ఉండగానే పేకాట ఆడటం ప్రారంభించారు. అయితే వారి యాత్ర అనుకున్నన్ని రోజులు సాగలేదు. ప్రయాణం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే పోలీసులు వారిని పట్టుకున్నారు.