10-04-2025 06:27:16 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ మండలంలో రెండు చోట్ల గుడి హుండీలు పగలగొట్టి నగదు చోరీ చేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం... ఖానాపూర్ మున్సిపాలిటీలోని కొమరం భీమ్ చౌరస్తా వద్ద ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గుర్తు తెలియని దొంగలు గుడి తలుపులు, తాళాలు, పగలగొట్టి ఆభరణాలు, హుండీలోని నగదు సుమారు రూ. 5000 దొంగలించారు.
మొత్తం విలువ 10,500 వరకు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. దాంతో పాటు మండలంలోని తర్లపాడు గ్రామ శివారుణ గల అగ్గి మల్లన్న గుడి తలుపులు, తాళాలు, హుండీ పగలగొట్టి, గుడిలోని నగలు, నగదు సుమారు 3000 దొంగలించారు. మొత్తం విలువ 30 వేల వరకు ఉంటుందని, కామోజీ శ్రీనివాస్, ఏనుగుల చంద్రభూషణ్ రెడ్డి, ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.