calender_icon.png 18 March, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థితులకు నగదు బహుమతి అందిస్తా..

17-03-2025 07:57:03 PM

సంఘ సేవకులు అయిత పరంజ్యోతి.. 

చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చేగుంటలోని దీప్తి విద్యాలయాలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు, పరీక్ష ప్యాడ్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా మండల నీరజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ నీరజ మాట్లాడుతూ... అయిత పరంజ్యోతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటకు గతంలో కోతుల బెడదను నివారించడానికి జాలిని, వాలీబాల్ కిట్ ను కూడా అందించడం జరిగిందని, జాతీయ క్రీడలకు బహుమతులు కూడా అందజేయడం జరిగిందని, ఇదే సహకారాన్ని భవిష్యత్తులో కూడా మా పాఠశాలకు, మా మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు సహకారం అందించాలని వారు కొరారు.

అనంతరం అయిత పరంజ్యోతి మాట్లాడుతూ... పదో తరగతి అనేది విద్యార్థులకు ఒక మైలురాయి వంటిదని, అందరూ బాగా చదివి మంచి మార్కులు సాధించాలని, పదో తరగతి బోర్డు పరీక్షలో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ₹5,000 నగదు బహుమతిగా అందించడంతో పాటు, శాలువాతో సన్మానం చేస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచ్చ నర్సింలు, సొసైటీ డైరెక్టర్ రఘురాములు, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు కుర్మ లక్ష్మి, కట్ట జనార్దన్ గౌడ్, హమాలీ సంగం సభ్యులు, ఉపాధ్యాయులు రఘుపతి, రాజేశ్వర్, సుధాకర్ రెడ్డి, చల లక్ష్మణ్ వెంకటేష్ మనోహర్రావు సురేందర్, శారద, రాధా, రమా, రమాదేవి, రేఖ తదితరులు పాల్గొన్నారు.