05-04-2025 01:49:44 PM
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు అందజేత..
వైరా, విజయక్రాంతి: సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి వైరా వారి ఆధ్వర్యంలో రఘునాథపాలెం మండలం వి.వి. పాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లో గర్భిణీ స్త్రీలు ,బాలింతలకు పలు సౌకర్యాలను కల్పించారు.. వారు కూర్చోవడం కోసం కుర్చీలు, ఫ్యాన్, మంచినీళ్ళ క్యాన్, టేబుల్, ర్యాక్ మొదలైన సామాన్లు సుమారు 10 వేల రూపాయల విలువైన వస్తువులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న తల్లాడ ఎంపీడీవో ఏనుగు సురేష్ బాబు మాట్లాడుతూ ఈ సంస్థ వారు చేపట్టిన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అని తెలిపారు భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో సామాజికంగా ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మరో అతిధి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు సుమన్ బాబు మాట్లాడుతూ ఈ సంస్థ వారు చేపట్టిన అన్ని కార్యక్రమాలు అర్హత కలిగిన వారికి చేరువ అవుతున్నాయని వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు యంపీ దాస్, సీడీపీఓ వీరభద్రమ్మ, తల్లాడ ఏపీఓ కోటయ్య, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, అంగన్వాడీ సిబ్బంది, సంస్థ ప్రతినిధులు శోభన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్రోత్సాహక నగదు అందజేత..
పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సంస్థ ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదును అందజేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల లో ప్రధమ స్థానంలో నిలిచిన సింధు కు 5వేల రూపాయలు,ద్వితీయ స్థానంలో నిలిచిన చైత్ర కు రూ 4వేలు , తృతీయ స్థానంలో నిలిచిన స్రవంతి కి.3వేలు ప్రోత్సాహక నగదు ను బహుమతులుగా అందజేశారు..