19-04-2025 05:02:51 PM
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లిశేట్టి బుచ్చి పాపయ్య..
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలలో నగదు జమ అవుతున్నాయని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లిశేట్టి బుచ్చి పాపయ్య అన్నారు. విలేకరుల సమావేశంలో బుచ్చి పాపయ్య మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం, మండల పరిధిలోని తాడువాయి గ్రామం పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నిక అయింది. గ్రామంలో ఇందిరమ్మ ఇడ్ల నిర్మాణం పనులు చేపట్టిన లబ్దిదారులకు బెసిమెంటు బిల్లు మొదటి విడత లక్ష రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లిశేట్టి బుచ్చి పాపయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు.