calender_icon.png 14 January, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ డిపోలో ఉత్తమ డ్రైవర్ కు నగదు పురస్కారం

13-01-2025 11:13:03 PM

నగదు పురస్కారాన్ని అందజేసిన డిఎం ఇందిరా...

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఆర్టీసీ డిపోలో ఉత్తమ డ్రైవర్ గా సంగయ్య నాయక్ కు సోమవారం కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా నగదు పురస్కారాన్ని అందజేశారు. తక్కువ డీజిల్ వాడకంతో పాటు ఎక్కువ మైలేజ్ బస్సు నడిపినందుకు ఉత్తమ డ్రైవర్ అవార్డు ఎంపిక చేసినట్లు డిపో మేనేజర్ ఇందిరా తెలిపారు. ఆర్టీసీ సమస్త అభివృద్ధికి కృషి చేసే డ్రైవర్లకు కండక్టర్లకు ఉత్తమ అవార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్ సంగీయ నాయక్ మాట్లాడుతూ... ఈ అవార్డు రావడం తనకు మరింత బాధ్యతలు పెరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.