03-04-2025 10:56:28 PM
ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): హోటలల్లో కల్తీ ఫుడ్డు తయారుచేసి వినియోగదారులకు అందజేసినట్లయితే వారిపై కట్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ అన్నారు. పట్టణం లో పలు హోటల్స్ ను గురువారం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మనోజ్ తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో చికెన్ బిర్యాని శాంపిల్స్ సేకరించి లేబరటరీకి పంపించడం జరిగిందన్నారు. ఇందులో ఏమన్నా కల్తీ నిర్దారణ జరిగితే క్రిమినల్ కేస్ రిజిస్టర్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.