calender_icon.png 4 March, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

04-03-2025 06:23:50 PM

అటవీ భూములు ఆక్రమిస్తే పిడి యాక్ట్ కింద కేసులు

 జిల్లా అటవి శాఖ సంరక్షణ అధికారిని భోగ నికిత 

కామారెడ్డి,(విజయక్రాంతి): అడవులలో పెరిగే వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అటవీశాఖ సంరక్షణ అధికారిని భోగ నికిత తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో విజయ క్రాంతి ప్రతినిధితో మాట్లాడారు. రానున్న వేసవికాలంలో అటవీ జంతువులకు నీటి సమస్య పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడగగా అడవుల్లో వన్యప్రాణులకు తాగునీటి ఎద్దడి తీర్చడానికి మూడు రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో పర్కులేషన్ ట్యాంకులు, చెక్ డ్యాముల నిర్మాణం, నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న అటవీ ప్రాంతాల్లో సాసర్ ప్లేట్లను నిర్మించి వాటిలో నీటిని నింపి వన్యప్రాణులకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పోడు భూముల పేరుతో గిరిజనులు ఇతరులు అడవులను నరికి పంటలు సాగు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిని గుర్తించి వెంటనే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

2005 అటవీ చట్టం ప్రకారం అంతకుముందు అటవీ భూములను కబ్జా చేసి సాగు చేసుకున్న వారికి పోడుపట్టాలను ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. తరువాత అడవులను నరికి పోడు భూములుగా తయారుచేసి సాగు చేసుకోవాలనుకున్న రైతులకు  ఎట్టి పరిస్థితులలో భూములు దక్కవని గిరిజనులకు తండాల వద్దకు వెళ్లి అటవీ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆటవి భూములను ఆక్రమించుకొని పంటలు సాగు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాల మేరకు కలెక్టర్ తో మాట్లాడి  వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయిస్తామని జిల్లా అటవీ శాఖ ఐఎఫ్ఎస్ అధికారిని భోగ నికిత అన్నారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో విజయ క్రాంతి ప్రతినిధితో మాట్లాడారు. అటవీ భూములను ఆక్రమించుకోవడం చెట్లు నరికి వేయడం సాగు చేయడం చట్ట విరుద్ధమన్నారు. పోలీసు రెవెన్యూ వాళ్ళ సహకారంతో రాజంపేట మండలం కొండాపూర్ గ్రామం పరిసర ప్రాంతాల్లో అటవీ భూమి ఆక్రమించుకున్న వారి నుండి 6o హెక్టార్ల భూమిస్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

బాన్సువాడ రేంజ్ పరిధి లో గౌరారం వద్ద గిరిజనులు అటవీ భూములను కబ్జా చేస్తే రిజర్వ్ ఫారెస్ట్ గా ఏర్పాటుచేసి వాటిని శాఖ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. రెడ్డి మండలం గన్ పూర్ ఎం గ్రామ పరిధిలోని గజ్జ నాయక్ తండ రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండా లో కూడా అటవీ భూములు స్వాధీనం చేసుకున్న సమయంలో ప్రజల నుండి అటవీ అధికారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయుని అయినప్పటికీ పోలీస్ రెవెన్యూ అధికారుల సహకారంతో అటవీ భూమిని రక్షించామన్నారు. ఫారెస్ట్ కమిటీకి కలెక్టర్ చైర్మన్ ఎస్పీ మెంబర్ గా ఉంటారని ఆమె అన్నారు.షేర్ శంకర్ తండాలో అటవీ భూమిని ఆక్రమించుకున్న దానిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అలాగే కందకాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అటవీ భూములు దున్నుతున్న నెంబర్ లేని ట్రాక్టర్లను 50 వరకు స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగిందన్నారు. చట్టాలను అతిక్రమించి ఎవరు అక్రమాలకు పాల్పడ్డ శిక్షలు తప్పవని అన్నారు.  వీటిలో ఐదు నెంబర్ లేని ట్రాక్టర్ లను స్వాధీనం చేసుకోవడం ఫారెస్ట్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగిందన్నారు. అడవి చట్టాలపై భూమిని ఆక్రమించిన వారితో అవగాహన సదస్సులు వారిని చైతన్య పరచడానికి అటవీ చట్టాల గురించి అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహించడం జరిగిందన్నారు.

13 డిసెంబర్ 2005 లోగా 10సంవత్సరాల నుండి అడవి భూములు సాగు చేసుకున్న గిరిజనులు, 40 సంవత్సరాల నుండి అటవీ భూమిని సాగు చేసుకున్న ఇతర వర్గాల వారికి మాత్రమే ప్రభుత్వం భూమి హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ తేదీ తర్వాత అటవీ భూములను ఆక్రమించుకున్న వారికి అటవీ చట్టం ప్రకారం శిక్షలు తప్ప భూములు రావు అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని అవగాహన చేసుకుని అటవీ భూముల ను ఆక్రమించుకొని కేసుల పాలు కావద్దని వారి కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవద్దని ఎవరో చెప్పిన తప్పుడుమాటలు విని మొండిగా వ్యవహరించడం మంచిది కాదని ఆమె హితువు పలికారు. అడవికి నిప్పు పెట్టడం నేరం. ఇలాంటి వారిని పట్టుకున్నట్లయితే అటవీ హక్కుల చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం అన్నారు. అడవి హక్కుల చట్టం పై ప్రజల తో చాలా సందర్భాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. విస్తృతంగా జరిగిన ఈ ప్రచారం వల్ల ప్రతి ఒక్కరికి చట్టంపై అవగాహన ఉందని భావిస్తున్నానని అయినప్పటికీ ఇప్పటికీ 20 వేల ఎకరాల భూమి ఆక్రమణల ఆధీనంలో ఉందన్నారు. ఈ భూమిని కూడా త్వరలోనే స్వాధీనం చేసుకోవడానికి కృషి చేస్తామని ఆమె చెప్పారు.

అటవీ భూములు ఎక్కడినుండి ఎంతవరకు ఉన్నాయి అనే రికార్డు ప్రతి చోట భద్రంగా ఉందన్నారు. అటవీ భూములను ఆక్రమించుకున్న వారిపై మొదటి దశలో ఎమ్మార్వో గారికి బాండ్ అవర్ చేయడం జరుగుతుందని రెండవసారి ఇదే తప్పు చేసినట్లయితే కేసునమోదు చేయడం జరుగుతుందని పదే పదే అడవి భూములను ఆక్రమించుకోవడం జరిగితే కలెక్టర్ అనుమతితో వీధి యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా భావితరాల భవిష్యత్తును మానవజాతి మనుగడ కోసం చెట్లను పెంచడం కాపాడడం పచ్చదనాన్ని ప్రోత్సహించడం మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. అటవీ జంతువులను వేటాడితే కఠినంగా శిక్షిస్తాం..... అటవీ జంతువులను వేటాడితే కఠినంగా శిక్షిస్తామని వేటగాళ్లపై నాన్ బెలేబుల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. అటవీ పరిరక్షణ చట్టం 51 సెక్షన్ 9  కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే వారి సమాచారం తమకు చేరవేర్చడానికి గ్రామాల్లో ఇన్ఫార్మర్ వ్యవస్థను మెరుగుపరుచుకున్నామని ఈ వ్యవస్థ వల్ల జంతువులను వేటాడే వేటగాళ్లు ఈ వృత్తికి మానుకొని ఇతర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని ఆమె చెప్పారు. ప్రజల్లో మార్పు వచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.