calender_icon.png 19 February, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమభావన సంఘాల నగదును అక్రమంగా వాడుకుంటే కేసులు నమోదు చేయాలి

29-01-2025 12:06:08 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, జనవరి 28 : సమ భావన సంఘాల నగదును అక్రమంగా వాడుకుంటే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జిల్లాలోని నూతనకల్ మండల కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో ఆయా శాఖల పనులపై మంగ ళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ భావన సంఘాలను మహిళలు సక్రమంగా నిర్వహించుకునేలా చూడాలన్నారు.

తీసుకున్న లోన్‌కు సం బంధించిన నగదును ప్రతి నెల తప్పక చెల్లించేలా అధికారులు చూడాలన్నారు. అలాగే సంఘాల నగదును ఎవరైనా అక్రమంగా వాడుకుంటే వారిపై తప్పక కేసులు నమోదు చేయాలనీ సూచించారు. అదేవిధంగా మండలంలో సోలార్ యూనిట్లకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల అధికారులను వారి పనులపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీవో, ఏపీవో పలువురు అధికారులు పాల్గొన్నారు.