calender_icon.png 20 September, 2024 | 6:07 AM

ఒకే ఊరిలో 13 మందిపై కేసులు నమోదు

06-09-2024 04:41:34 PM

అశాంతిని నెలకొల్పుతున్నారంటూ రెండు వర్గాలకు పోలీసుల ట్రీట్మెంట్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): గ్రామంలో చిన్నచిన్న గొడవలను పెద్దవి చేస్తూ అహంతో గ్రామంలోని ప్రజల మధ్య చిచ్చు పెడుతూ వారిమధ్య అశాంతిని నెలకొల్పుతున్న రెండు వర్గాల వారిపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడు మంది, కాంగ్రెస్ పార్టీకి చెందిన అరుగురు మొత్తంగా 13 మందిపై కేసులు నమోదు చేసి వారిని బైండోవర్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ మండలం బొందలపల్లి గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాధవరెడ్డిలు ఇరువురూ తమ రాజకీయ స్వలాభం కోసం గ్రామస్తుల మధ్య చిన్నపాటి గొడవలను పెద్దవి చేస్తూ గ్రామంలో అశాంతిని నెలకొల్పుతున్నట్లు గుర్తించామన్నారు. 

చదువుకోవాల్సిన యువతను కూడా మద్యానికి,  చెడు తిరుగుళ్ళకు బానిసలుగా మారుస్తూ వారిని వారి రాజకీయ లబ్ధి కోసం యువతను బలి చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  ప్రజల మధ్య జరిగే చిన్నపాటి వాదనలను రాజకీయ రంగు పులుమి దాడులకు ఉసిగొల్పడంతో గ్రామంలో అశాంతి నెలకొందని గ్రామస్తులు తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తిని చిన్నపాటి గొడవను పెద్దగా చేస్తూ కర్రలు, రాళ్లతో దాడులు చేసుకునే పరిస్థితికి కారణం అయ్యారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఆ ఇద్దరూ ప్రధాన పార్టీల లీడర్లతో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేస్తున్నట్లు డిఎస్పి బుర్రి శ్రీనివాసులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ అంశం చర్చకు దారి తీస్తోంది.