calender_icon.png 30 March, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో 16 మంది వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు

26-03-2025 11:03:17 PM

ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకొని అధిక వడ్డీలకు ఇచ్చిన వ్యాపారులు..

వడ్డీ వ్యాపారులకు షాక్ ఇచ్చిన పోలీసులు..

కామారెడ్డి (విజయక్రాంతి): వడ్డీలతో నడ్డి వీరుస్తున్న వడ్డీ వ్యాపారులకు కామారెడ్డి జిల్లా పోలీసులు షాక్ ఇచ్చారు. వడ్డీకి డబ్బులు ఇస్తూ ఆస్తులు తనకా పెట్టుకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులను గుర్తించిన పోలీసులు 16 మంది వడ్డీ వ్యాపారులపై కామారెడ్డి జిల్లా పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వడ్డీ వ్యాపారులు ఊహించని విధంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వారు నిర్వహించిన వడ్డీ వ్యాపారం సంబంధించిన పత్రాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులకు పోలీసులు జలక్ సృష్టించారు. ఈ వడ్డీ వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో వడ్డీ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరికొంతమంది జిల్లాలో వడ్డీ వ్యాపారులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి భరతం పట్టే చర్యలు త్వరలోనే తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.