calender_icon.png 15 November, 2024 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు లేకుంటే కేసులు

11-11-2024 01:33:51 AM

ఆహార కల్తీపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి 

హైదరాబాద్, నవంబర్ ౧౦ (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్ ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్టార్ హోటళ్ల నుంచి మొదలు స్ట్రీట్‌ఫుడ్ స్టాల్స్ వరకు ఎక్కడికక్కడ దాడు లు నిర్వహించి అనేక కేసులు నమోదు చేశా రు.

తనిఖీల్లో 95 శాతం హోటళ్లలో నాణ్యత ప్రమాణాలు సరిగా లేవని తేలడంతో ఫుడ్ సేఫ్టీపై హోటళ్లు, ఫుడ్ స్టాల్స్ యజమానులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు సరైన ఆహారం అందించడమే లక్ష్యంగా అన్నీ జిల్లా కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

ప్రతీ ఫుడ్ స్టాల్‌కు ప్రత్యేకంగా లైసెన్సులు జారీ చేస్తున్నారు. లైసెన్సులు లేనివారిపై కేసులు నమోదుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గడిచిన మూడు వారాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాం డర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించారు. 3,774 మంది స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు.వీరికి సుమారు 60కి పైగా ట్రైనింగ్ సెషన్స్ ఏర్పాటు చేశారు. 

  కలెక్టరేట్లలో ఫిర్యాదు కేంద్రాలు..

పెరిగిన హోటళ్లు, జనాభాకు అనుగుణం గా ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే 17 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సిం హా ఆదేశాల మేరకు అన్ని  కలెక్టరేట్లలో ఫుడ్ సేఫ్టీ జిల్లా ఆఫీసర్‌ను నియమించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా తనిఖీల కోసం మరో ఇద్దరు అధికారులను నియమించనున్నారు.

దీంతో ప్రజలు ఫుడ్ సేఫ్టీపై స్థానికంగానే ఫి ర్యాదు చేసేందుకు అవకాశం ఏర్పడనుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కార్యాలయంలోని ఫిర్యాదుల విభాగం నెంబర్ 9100105795 కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏకైక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ హైదరాబాద్‌లోని నాచారంలో ఉంది.

గత ప్రభుత్వాలు ఈ ల్యాబ్‌ను ఆధునీకీకరించకపోవడంతో ఫుడ్ టెస్టింగ్‌కు  ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో కాంగ్రెస్ సర్కారు 10 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి రోజుకు 200 శాంపిల్స్ చేసేలా ఏర్పాటు చేసింది. ఇప్పుడు మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్‌లో కొత్తగా మూడు టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పా టు చేస్తున్నారు. నాచారం ల్యాబ్‌ను ఆధునీకీకరిస్తున్నారు. ఫలితంగా ఏడాదికి 24 వేల ఫుడ్ శాంపిల్స్ చేసే అవకాశం ఉంది.