- బాలకార్మికులు కనిపిస్తే పోలీస్ వారికి సమాచారం అందించండి
- బాల కార్మికుల వ్యవస్థను రూపుమాపుదాం
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల, జనవరి 3 (విజయ క్రాంతి): చిన్నపిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జనవరి 1 నుండి 31 వరకు నిర్వహిస్తున్న ఆపరే షన్ స్ముల్ - 11 ను ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేసి విజయవంతం చేయాలన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్,అదనపు ఎస్పీ చంద్రయ్య,వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆపరే షన్ స్ముల్ -11లో పాలుపంచుకొంటున్న ప్రతి ఒక్క అధికారి సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకోని,బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా విధులు నిర్వహిం చాలన్నారు.
ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైనదని, దానిని అనుభవించుటా ప్రతీ పౌరుని హక్కు అని,క్షణికావేషంలో పిల్లలు తొందరపాటులో చిన్న చిన్న విష యాలకే తల్లి దండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారన్నారు.ఇట్టి అవకా శాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వారిని ప్రమాదకర పనుల్లో వారితో పనులు చేయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటు న్నారని అన్నారు.
అలాంటి వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని,గత సంవత్సరం నిర్వహించిన ఆపరేషన్ స్ముల్, ముస్కాన్‌లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. తప్పిపోయిన పిల్లలను వెతికి ‘దర్పణ్ ‘ అప్లికేషన్ ద్వారా వారిని గుర్తించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచి, తిరిగి తల్లి దండ్రుల వద్దకు చేర్చి వారి శోకాన్ని తీర్చాలన్నారు.
బిక్షాటన చేస్తున్న, బాలకార్మికుల గురించి ఎప్పటి కప్పుడు సమాచారం ఇవ్వడానికి చైల్డ్ హెల్ప్ లైన్ కు చెందిన 1098,112 నెంబర్ల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. సిరిసిల్ల, వేములవాడ డివిజన్ స్థాయిలో ఒక సబ్-ఇన్స్పెక్టర్ తో పాటుగా ఒక మహిళా పోలీస్ అధికారి, నలుగురు సిబ్బంది, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో నెల రోజుల పాటు ఇదే పనిపై ఇటుక బట్టి లు,వివిధ రకాల పరిశ్రమలు,బస్ స్టేషన్లు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబా లకు దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించాలన్నారు.
స్కూల్స్ కు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల డ్రాపౌట్ అయిన పిల్ల ల తల్లి దండ్రులకు నచ్చ చెప్పి తిరిగి వారిని పాఠశాలకు పంపే ఏర్పాటు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలన్నారు.ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేసి లేదా పోలీస్ లకు సమాచారం తెలపాలని ఎస్పీ కోరారు.
ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సీడబ్ల్యూ సి చైర్మన్ అంజ య్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజి త, ఎస్.ఐ రమేష్,షీ టీం ఎస్.ఐ ప్రమీల, అధికారులు పాల్గొన్నారు.