పేరు మర్చిపోయినందుకు రాష్ట్రంలో కేసులు
తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారు
నిజామాబాద్ పవర్ సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిస్తాం
నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...
నిజామాబాద్ (విజయక్రాంతి): కేంద్రాన్ని ఎదిరించినందుకు ఢిల్లీలో కేసులు పెడుతున్నారని ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు కేసులు పెడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని అందుకే తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జైలు నుండి విడుదలైన తర్వాత తొలిసారిగా నిజామాబాదు జిల్లాకు ఆదివారం వచ్చిన సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చే వరకు ఎక్కడికక్కడ నిలదీయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఏడాది గులాబీ జెండా అని అందులో సందేహమే లేదని భీమ వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండా అని జోస్యం చెప్పారు. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డని తప్పు చేసే ప్రసక్తే లేదని కేవలం కేంద్రాన్ని ఎదిరించడం వల్లే కేసులు నమోదు చేశారని కేసిఆర్ ని ఎదిరించే ధైర్యం లేక తనపై అన్న కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. తమది భయపడే రక్తం కాదని భయపెట్టే రక్తం అని తప్పు చేయనప్పుడు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. కాంగ్రెస్ బిజెపి లను వెంటాడుతామని అనేక ఇబ్బందులు కష్టాలు ఎదురైన పిడికిలి బిగించి ఎదుర్కొని వచ్చానని అన్నారు.
పేరు మర్చిపోయిన రైతులు భూములు ఇవ్వకపోయినా కేసులు పెట్టి రేవంత్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బరువు ఎత్తుకున్నాడు ఓపికతో ఉండాలని ఆమె రేవంత్ రెడ్డికి పరోక్షంగా పలికారు. ప్రజల ఇబ్బందులు పరిష్కరించడానికి అధికారం కట్టబెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మరిచిపోయాయని ఆమె అన్నారు. డిగ్రీ చదువుకున్న పిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైందని మహిళలకు నెలకు 2500 కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వలేదని ఆమె ఆమె ఆరోపించారు. ముఖ్యంగా మైనార్టీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదని బీదాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పెన్షన్ మొత్తాన్ని చెల్లించలేదన్నారు. మనం ఊరుకుంటే ప్రభుత్వంలో కదలికరదాని ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆమె కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయి రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుందని రాష్ట్రంలో పోలీసులు నడుస్తోందని వారి కనుసన్నల్లోనే పోలీసులు పని చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను పనులను కొనసాగించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసాపై ప్రభుత్వ మాట్లాడడం లేదని గురుకులాల పాఠశాలలు నడపడానికి ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఇప్పటికీ 57 మంది పిల్లలను ఫోటోలు పెట్టుకున్నారని ఇంకా ఎంతమంది విద్యార్థులను పట్టణ పెట్టుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తున్నారని కవిత గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సులను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బస్సుల సంఖ్యను తగ్గించి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. మనకు కావలసింది కాంగ్రెస్ మాత కాదని మన తెలంగాణ తల్లి మనకు కావాలని ప్రజల ఉపాధి పైనే కాకుండా సంస్కృతిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తోందని ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలకు పాల్పడిన భయపడే ప్రసక్తే లేదని మరొకసారి నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపించాలని పార్టీ శ్రేణులకు కవిత పిలుపునిచ్చారు.