* పేరు మరిచిపోయినందుకు రాష్ట్రంలో కేసులు
* తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాత!
* నిజామాబాద్ పర్యటనలో ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): కేంద్రాన్ని ఎదిరించినందుకు ఢీల్లి కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో సీఎం పేరు మర్చిపోయినందుకు కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా ఆదివారం ఆమె నిజామాబాద్ జిల్లాలో పర్య టించారు. నగరంలోని సుభాష్‌నగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఏర్పా చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడు తూ.. రాష్ట్రంలో తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారని విమర్శించారు. తప్పుడు వాగ్ధానాలతో అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హమీలు నెరవేర్చే వరకు ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని జోస్యం చెప్పారు.
తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనిని, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. కేవలం కేంద్రాన్ని ఎదిరించడంవల్లే తనపై కేసులు నమోదు చేశారన్నారు. కేసీఆర్‌ను ఎదిరించే ధైర్య లేక తనతోపాటు, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. పేరు మర్చిపోయినా, రైతులు భూములు ఇవ్వకపోయినా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజల ఇబ్బందులు తీర్చాలని అధికారం కట్టబెడితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మరిచిపోయాయని ధ్వజమెత్తారు. ఇచ్చిన ఒక్క హమీని కూడా కాంగ్రె స్ అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను, పనులను కొనసాగించాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకులాలలు, పాఠశాలలు నడపడానికి ప్రభుత్వానికి చేతకావడం లేదన్నా రు. ప్రజల ఉపాధి, సంస్కృతిపైనా కాంగ్రెస్ దాడి చేస్తోందని కవిత విమర్శించారు.