calender_icon.png 22 January, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలన చేతగాకే కేసులు

07-12-2024 02:37:47 AM

కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ నేతల ఫైర్

ఖమ్మం, డిసెంబర్ 6 (విజయక్రాంతి): పాలన చేతగాకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ, అక్రమ కేసులు పెడుతున్నదని ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు.

శుక్రవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి  ప్రతిపక్ష నాయకులను అణిచివేస్తున్నారని మండి పడ్డారు. అందులో భాగమే హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డిపై కేసులన్నారు. పోలీస్ వ్యవస్థతో రాజ్యమేలాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో మరింత చులకనవుతారని అన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహంపై కూడా రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, శీలంశెట్టి వీరభద్రం పాల్గొన్నారు.