17-04-2025 05:26:54 PM
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయి...
మునగాల: కక్ష సాధింపుతోనే కాంగ్రెస్ అగ్ర నేతలపై కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుందని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తక్కలపాటి సాయి అన్నారు. గురువారం మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తదనంతరం సాయి మాట్లాడుతూ... కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవస్థలను శాసిస్తుంది. స్వయం ప్రతిపత్తి గల సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడం వారి రాజకీయ స్వార్థమేనని స్పష్టమవుతుంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచే మోడీ ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈడీ, సీబీఐ లాంటి సంస్థల ద్వారా కేసుల నమోదుతో ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరిస్తూ గొంతు నొక్కాలని చూస్తుంది. ఇది ఎల్లకాలం నడవదు. కాంగ్రెస్ పార్టీ సైనికులుగా, ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యం కూని కాకుండా ప్రజాస్వామ్యవాదులుగా మనందరం మోడీ ప్రభుత్వ చర్యలపై పోరాటం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వేనేపల్లి వీరబాబు గట్టు ఉపేందర్ గ్రామ శాఖ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.