12-03-2025 12:00:00 AM
తెలంగాణ మెడికల్ కౌన్సిల్
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో తమ పరిధికి మించి వైద్యం చేస్తున్న 12 మంది ఆర్‌ఎంపీలపై కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్‌లో 8 మం ది, సంగారెడ్డిలో ముగ్గురు, దుండిగల్‌లో ఇద్దరు, బాన్సువాడ, కామా రెడ్డిలో ఒక్కొక్కరు ఉన్నారు. ఆయుర్వేదం చదివి ఎంబీబీఎస్ సేవలు అందించడం కూడా నేరమని, వారి పై చర్యలు తప్పవని కౌన్సిల్ చైర్మన్ మహేశ్‌కుమార్ స్పష్టం చేశారు.