10-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9(విజయక్రాంతి) : గోషామహల్ ఎ మ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మంగళవారం రెండు కేసులు నమోదు చేశారు. ధూల్‌పేట్ లో ఇటీవల నిర్వహించిన శ్రీరామనవమి శోభాయాత్రలో డీజేలు, విని యోగించడం, అభ్యంతరకర పదజాలంతో మాట్లాడటంతో పోలీసులు కే సు నమోదు చేశారు. శోభాయాత్ర విషయంలో రెండు రోజుల క్రితమే ఆయనపై ఓ కేసు నమోదైంది.