calender_icon.png 24 December, 2024 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు

21-12-2024 03:09:26 AM

  1. జిల్లాలో 285 వాహనాలు సీజ్
  2. తరచు మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే  కేసులు 
  3. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

 సిరిసిల్ల, డిసెంబర్ 20 (విజయ క్రాంతి): మైనర్లు  వాహనాలు నడిపి పట్టుపడితే తల్లిదండ్రులు,వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం స్పెషల్ డ్రైవ్ లో మైనర్ డ్రైవింగ్  చేస్తూ పట్టుబడిన సుమారు 300 వాహనాలు సీజ్ చేసి, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్  నిర్వహించి, చాలాన్ల కింద జరిమాన విధిస్తూ వాహనాలు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ   మాట్లాడుతూ కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమే,  ట్రాఫిక్,రోడ్డు నిబంధ నలు తెలియని  మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని, వారు  తెలియని డ్రైవింగ్ తో ప్రమాదాలకు కారణం  అవుతున్నారన్నారు. రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ చేయడం వలన వృద్ధుడు  మరణించాడని, ఆ మైనర్ తల్లి దండ్రులపైన కేసు నమోదు చేశామన్నారు.

మైనర్ డ్రైవింగ్  చేస్తూ,మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమై ఎదుటి వారి ప్రాణాలకు  ప్రమా దం కలిగిస్తే 10 సంవత్సరాల కఠిన శిక్షలు పడేల చట్టాలు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులకు, వాహనాల యజమానులు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ  వహించాలని 18 సంవత్స రాలు నిండని పిల్లలకు వాహనాలు ఇవ్వద్దన్నారు.

పిల్లలకు వాహనాలు  ఇవ్వడం వలన ఏదైనా జరగరాని సంఘట నలు జరిగితే  కుటుంబం జీవితాంతం బాధపడవలసి  వస్తుందని, పిల్లలను రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు  తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు.

మైనర్ డ్రైవింగ్, రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు  గురించి జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్ధిని విద్యార్థులకు రోడ్ సేఫ్టీ, ఎడ్యుకేషన్ క్లాసెస్  కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనల, మైనర్ డ్రైవింగ్ జరుగుతున్న రోడ్డు  ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ  కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ.లు, ఎస్.ఐ.లు, సిబ్బంది పాల్గొన్నారు.