calender_icon.png 15 November, 2024 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరేందర్‌రెడ్డిపై పది సెక్షన్ల కింద కేసులు

15-11-2024 12:53:30 AM

  1. రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ ప్రస్తావన
  2. కీలక మలుపు తిరిగిన కేసు

వికారాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): లగచర్ల భౌతికదాడుల కేసులో ఏ1 నిందితుడిగా అరెస్టున మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిపై బుధవారం పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 61 (2), 49, 191 (2), (3), 132, 109, 121 (1), 126 (2), 336 (4), 324(4), 190 కింద కేసులు నమోదు చేశారు. నరేందర్‌రెడ్డిని కోర్టులో హాజరు పరిచి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారని తెలిసింది.

ఫార్మాసిటీకి భూములు ఇవ్వొద్దని రైతులకు సూచించారని, ఏ2 నిందితుడు సురేశ్ సాయంతో గ్రామస్తులను రెచ్చగొట్టించినట్లు రిపోర్టులో పేర్కొన్నారని, అలాగే దాడిలో పరోక్షంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని, ప్రత్యేకంగా ఆయన పేరును ప్రస్తావించినట్లు తెలిసింది.  ఐజీ సత్యనారాయణ బుధవారం నరేందర్‌రెడ్డిని విచారించిన సమయంలోనూ ఇవే అంశాలపై ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది.

కేటీఆర్ ప్రమేయంపై స్పష్టమైన సాంకేతిక ఆధారాలు ఉండబట్టే పోలీసులు ఆయన పేరును  రిమాండ్ రిపోర్టులో చేర్చినట్లు సమాచారం. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరుగుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. నరేందర్‌రెడ్డి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కాల్ రికార్డ్స్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు.