calender_icon.png 16 January, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనగామ న్యాయవాదులపై కేసులు ఎత్తివేయాలి

08-08-2024 03:51:39 AM

విజయక్రాంతి నెట్‌వర్క్: జనగామకు చెందిన న్యాయవాద దంపతులు అమృతరావు, కవితపై పోలీసులు అకారణంగా దాడిచేసి, వారిపై అక్రమంగా కేసులు పెట్టారని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు  నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దంపతులపై కేసులు ఎత్తివేయాలని కోర్టుల్లో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. వారిపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులు సమాజానికి మంచికాదని, రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. నిరసనల్లో బార్ అసోషియేషన్ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.